![]() |
![]() |
.webp)
జబర్దస్త్ లో దొరబాబు అనే కమెడియన్ రాగానే అతని డైలాగ్స్ కి అతని ఎక్స్ప్రెషన్స్ కి నవ్వని వాళ్లంటూ ఎవరూ ఉండరు. అలాంటి దొరబాబు రీసెంట్ గా ఫామిలీ స్టార్స్ ఎపిసోడ్ కి వచ్చాడు. ఇక ఇండస్ట్రీకి వచ్చిన మొదట్ల ఆయన పడిన కష్టాలను గురించి చెప్పుకొచ్చాడు. "ఇండస్ట్రీకి నేను డైరెక్షన్ డిపార్ట్మెంట్ కి జాయిన్ అవుదామని వచ్చాను. అప్పుడు ఒక అబ్బాయి ఉండేవాడు. వాడు ఎం చెప్పాడంటే డైరెక్షన్ డిపార్ట్మెంట్ చాలా హార్డ్ గా ఉంటుంది. ఆర్టిస్ట్ గా ట్రై చెయ్యి బాగున్నావు కదా ఏదన్నా అవకాశాలు వస్తాయి అన్నాడు. ఆఫీస్ లన్నింటికీ తిరిగేవాడిని. తినడానికి కూడా తిండి ఉండేది కాదు.
అప్పుడు వినాయక చవితి వచ్చింది. ఆ తొమ్మిది రోజులు ఎక్కడ భోజనం దొరికితే అక్కడ ఒక్క పూట తిని ఉండేవాడిని. ఒక రోజు డిసైడ్ అయ్యాను. ఈ కష్టాలు మన వల్ల కాదు ఇండస్ట్రీ నుంచి పారిపోవాలి అని బట్టలు సర్దేసుకున్నా, మెట్లు దిగబోతున్నా అప్పుడు ఫ్రెండ్ నుంచి కాల్ వచ్చింది. నేను ఒక ఇంటర్నెట్ షాప్ పెడుతున్నా నువ్వు అందులో ఉంటే పార్టనర్ షిప్ ఇస్తాను అన్నాడు. సరే కొన్నాళ్ళు ట్రై చేద్దాం ఏదో ఒకటి షెల్టర్ దొరుకుతుంది కదా అనుకున్నా. నన్ను వాడు ఒక హాస్టల్ లో పెట్టి అమీర్ పెట్ లో ఒక ఇంటర్నెట్ సెంటర్ ఓపెన్ చేసాడు. మేమిద్దరం పార్టనర్స్ గా చాలా సంవత్సరాలు చేసాం.
ఐతే మధ్యలో నన్ను తెలిసిన ఒకడు మిస్ గైడ్ చేసాడు. నాతో అడల్ట్రీ షార్ట్ ఫిలిం చేయించాడు. అది చూసాకా నాకు ఇంటి దగ్గర నుంచి ఫోన్ లు వచ్చాయి. చాలా అవమానంగా ఫీలయ్యాను. నేను వాడికి ఫోన్ చేసి ఆ షార్ట్ ఫిలిం తియ్యకపోతే చచ్చిపోతాను అని బెదిరిస్తే వాడు దాన్ని రిమూవ్ చేసాడు. ఆ తర్వాత నేను ఊరికి వెళ్లాను. అక్కడ ఫ్రెండ్స్ అంతా నన్ను ఎగతాళి చేయడం మొదలు పెట్టారు. ఇలా కాదు నేను ఆర్టిస్ట్ ని ఐతే ఇవన్నీ మర్చిపోతారు అని అనుకున్నా. జబర్దస్త్ అప్పట్లో మంచి ఫామ్ లో ఉండేది. ఎలాగైనా అందులోకి వెళ్లాలని అన్నపూర్ణ స్టూడియో బయట చాల రోజులు తినకుండా తిరిగేవాడిని.
ఐతే ఒకసారి ఒకతని ద్వారా రామ్ ప్రసాద్ అన్నకు పరిచయం అయ్యి మొదటిసారి మీ టీమ్ లో నీకు (హోస్ట్ సుధీర్ ) డూప్ గా ఒక స్కిట్ చేశా. అప్పటినుంచి ఇప్పటి వరకు నాకు తిరుగులేకుండా నా లైఫ్ ముందుకు వెళ్తూనే ఉంది.. థాంక్యూ వెరీ మచ్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు " అంటూ తన కష్టాలు చెప్పాడు దొరబాబు. అంటే సుధీర్ కి డూప్ కి దొరబాబు స్కిట్ లో నటించాడన్నమాట.
----------------------
![]() |
![]() |